లక్సెంబర్గ్ నుండి బ్రస్సెల్స్ 240 కిలోమీటర్లు. మేము బయలుదేరేటప్పటికి మధ్యాహ్నం 3 గంటలు అయ్యింది. నేరుగా ప్రయాణించి సాయంత్రం 6 గంటలకల్లా బ్రస్సెల్స్ చేరుకున్నాం. ముందు రోజు రాత్రి కూడా నిద్ర లేకపోవటంతో నేరుగా హోటల్ కి చేరుకొని ఆ రోజుకి విశ్రాంతి తీసుకున్నాం. మరుసటి రోజు ఉదయం మే 4 వ తేది 2013 మా అదృష్టమో లేక యాద్రుచ్చికమో తెలియదు కాని ఆ రోజున మేము బ్రస్సెల్స్ లో ఉండగలిగాం. హిట్లర్ పాలనకి రెండవ ప్రపంచ యుద్ధంలో జరిగిన నరమేధానికి చరమ గీతం పాడిన రోజు అది. 1945 మే 4 న రెండవ ప్రపంచ యుద్ధం ముగిసింది. ఆ ఏడాది మొదటి నెలల్లో ఐరోపా పడమటి భాగంలో జర్మనీ చివరి సారిగా మిత్ర రాజ్యాల సేనలపై చేసిన పలు ఎదురు దాడులు విఫలమయ్యాయి. ఆ ఏడాది మే 4 న సోవియెట్ సేనలు జర్మనీ రాజధాని బెర్లిన్ నగరాన్ని ఆక్రమించటంతో హిట్లర్ ఆత్మ హత్య చేసుకున్నాడు. దానితో జర్మనీ మిత్ర రాజ్యాలకు లొంగిపోయింది.ఈ యుద్ధానంతరం అటువంటి మరో యుద్ధాన్ని నివారించే ఆశయంతో ఐక్య రాజ్య సమితి నెలకొల్పబడింది. మరోవంక, ఈ యుద్ధం కారణంగానే ఐరోపా దేశాలన్నీ ఏకీకరణ దిశగా అడుగులు పడటం మొదలయింది. అటువంటి చారిత్రాత్మక రోజున ఐరోపా రాజకీయ రాజధాని అయిన బ్రస్సెల్స్ లో ఉండటం మా అదృష్టమనే చెప్పాలి.
ఐరోపా రాజకీయ రాజధాని అని ఎందుకన్నానంటే యూరోపియన్ సమాఖ్య పార్లమెంట్ భవనం బ్రస్సెల్స్ లోనే ఉంది. ఐరోపా సభ్య దేశాల నుండి ఎన్నికైన ప్రతినిధులంతా ఇక్కడి పార్లమెంట్ భవనంలోనే సమావేశమవుతారు.ఐరోపా సమాఖ్య తీసుకునే పలు కీలకమైన నిర్ణయాలకి ఓటింగ్ ఇక్కడే జరుగుతుంది. ఈ సమాఖ్య రూప కల్పనలో కీలకంగా వ్యవహరించిన 5 దేశాల్లో బెల్జియం ఒకటి. అందుకే ఈ భవనాన్ని ఇక్కడ నిర్మించారు. 1952 లో ఇక్కడ తొలి సమావేశం జరిగింది. కొత్త దేశాలు ఈ యూనియన్ లో చేరాలన్నా, ఏదైనా సంక్షోభంలో ఉన్న దేశాలని ఆదుకోవాలన్నా ఈ పార్లమెంట్లో ఓటింగ్ ద్వారా నిర్ణయాలు తీసుకుంటారు. మేము మాములుగానే ఆ పార్లమెంట్ చూద్దామని ఉదయం 9 గంటలకల్లా అక్కడికి వెళ్ళాం. ఆరోజు అంతా అక్కడ సందడిగా ఉంది జనాలంతా పార్లమెంట్ ముందు క్యూ లో నిలబడ్డారు. అప్పుడే మాకు మే 4 అనే విషయం గుర్తొచ్చింది. ప్రతి సంవత్సరం ఆ రోజున ప్రజలందరినీ పార్లమెంట్ చూడటానికి అనుమతిస్తారు. అంతే కాదు నేరుగా పార్లమెంట్ సమావేశాలు జరిగే హాల్ లోకి వెళ్లి కూర్చోవచ్చు. పార్లమెంట్ పని తీరు , ఓటింగ్ జరిగే ప్రక్రియ అంతా అక్కడ చూడవచ్చు. నేను మాక్ ఓటింగ్ జరిగే చోటుకి వెళ్లి అసలు ఆ విధానం ఎలా ఉంటుందో అని చూసి నేను కూడా ఓటింగ్ లో పాల్గొన్నాను. పార్లమెంట్ హలో కూర్చొని మాక్ పార్లమెంట్ లో మాట్లాడటం మరిచిపోలేని అనుభవం.
హాల్ బయట ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రెండవ ప్రపంచ యుద్ధం తాలూకు ఫోటో ఎగ్జిబిషన్ ప్రత్యేక ఆకర్షణగా ఉంది. యుద్ధం ముగిసిన దగ్గరనుండి ఐరోపా సమాఖ్య ఏర్పాటు వరకు జరిగిన వివిధ ఘట్టాలని ఫోటోల రూపంలో వలయాకారపు ఓపెన్ ఆడిటోరియం లో చుట్టూ ఉంచారు. సందర్శకులందరికీ గుర్తుగా వారి ఫోటోని ప్రింట్ చేసి షర్ట్స్ ఉచితంగా ఇస్తున్నారు. సావనీర్లు, ఫోటోలకైతే లెక్కే లేదు. మేము కూడా ఆ పార్లమెంట్ సందర్శించినట్లు గా వారి నుండి ఒక అధికారిక ఫోటో తీసుకున్నాం. సందర్శకులంతా అక్కడ ఒక పచ్చటి పలక పై తమ సందర్శనకి గుర్తుగా సంతకాలు చేస్తున్నారు. మేము కూడా మా పేర్లు రాసి ఇండియా అని రాసాము. దాదాపు 4 గంటల సమయం అక్కడే గడిపి అక్కడినుండి సిటీ చూద్దామని బయటకి వచ్చాము. బెల్జియం లో ఎక్కువశాతం మంది కాథలిక్కులు అయినా అన్ని మతాల వారు ఇక్కడ నివసిస్తున్నారు. 2007 లో బౌద్ధులు తమ మతాన్ని గుర్తించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బెల్జియంలో ఐదు లక్షల మంది ముస్లింలు ఉన్నారు. అక్కడక్కడా మసీదులు కూడా కనిపించాయి, కాకపొతే మిగతా దేశాల్లో కనిపించే ఆకృతిలో కాకుండా ఒక బిల్డింగ్ లో ఉన్నాయి. బహిరంగ ప్రదేశాల్లో బురఖాని నిషేదించిన మొట్ట మొదటి యూరప్ దేశంగా బెల్జియం నిలిచింది. 2010 లో బ్రస్సెల్స్ ఫెడరల్ పార్లమెంటు దేశీయ వ్యవహారాల కమిటీ పాక్షికంగా, లేదా సంపూర్ణంగా బహిరంగ ప్రదేశాల్లో బురఖాని ధరించకుండా నిషేధం విధిస్తూ శాసనంద్వారా ఏకగ్రీవ తీర్మానం చేసింది. మేము వెళుతుండగా St. Michael and St. Gudula Cathedral కనిపించింది. ఇది అత్యంత పురాతనమైన ఎత్తైన చర్చి. 11 వ శతాబ్దంలో నిర్మాణం ప్రారంభిస్తే 1519 నాటికి గాని పూర్తి కాలేదు.కారు లోనుండే ఆ చర్చి ఫోటో తీసుకున్నాను.
అక్కడినుండి నేరుగా ఆటామియం దగ్గరికి వెళ్ళాము. 1958 లో ఒక ఎగ్జిబిషన్ నిమిత్తం దీనిని నిర్మించారు. బ్రస్సెల్స్ ఎక్స్ పో భవనం ముందు కొద్ది దూరంలో ఇది ఉంది. దీని ఎత్తు 335 అడుగులు, బెల్జియం లో ఇది వింతైన నిర్మాణం. పైకి వెళ్ళటానికి మెట్లు, ఎస్కలేటర్లు ఉన్నాయి. ప్రస్తుతం ఇది ఒక మ్యూజియం. పైకి వెళ్ళాలంటే టికెట్ ఉంది.
దీనికి పక్కనే మినీ యూరోప్ మ్యూజియం కూడా ఉంది. ఒక్కో దేశం నుండి ఒక్కో నిర్మాణాన్ని తీసుకుని వాటి మినీ రూపాలని ఇక్కడ నిర్మించారు. యురోపియన్ సమాఖ్యలో ఉన్న అన్ని దేశాల ఐకానిక్ భవనాలన్నీ మినియెచర్ రూపంలో ఇక్కడ చూడవచ్చు. బ్రస్సెల్స్ వెళ్తే మాత్రం చాక్లెట్ వాఫ్ఫెల్ తినకుండా మాత్రం రావద్దు. ఇక్కడ ఈ ఐటెం చాలా ఫేమస్ ఆటామియం పక్కనే చిన్న వాన్ లో వాఫెల్ అమ్ముతుంటే అక్కడే తిన్నాం. అప్పటికే హోటల్ చెక్ అవుట్ చెయ్యటంతో అక్కడినుండి నేరుగా నెదర్లాండ్స్ రాజధాని అమ్ స్టర్ డాంకి బయలుదేరాం.