వెనిస్ చూసి వచ్చిన 15 రోజులకి మా అసలైన ఐరోపా యాత్ర ప్రారంభమైంది. మాతో పాటు నా పోలాండ్ మిత్రుడు మార్చిన్ క్రదోహ దంపతులు వారి అబ్బాయి మాక్సిమ్ తో కలిసి కారులో 15 రోజుల పాటు జర్మనీ, ఆస్ట్రియా, లిచెన్ స్టైన్, స్విట్జెర్లాండ్, ఫ్రాన్స్, లక్సెం బర్గ్ , బెల్జియం, నెదర్లాండ్స్ దేశాల్లో మేము సాగించిన దాదాపు 4000 కిలోమీటర్ల ప్రయాణం ఇది. యూరప్ లో ఉన్న ఒకానొక అతి చిన్న దేశం లిచ్టేన్ స్టెయిన్.
ఎప్పుడూ అందరూ వెళ్ళే పారిస్, స్విట్జెర్లాండ్ కాకుండా ఇంకేమన్నా కొత్త దేశాలున్నాయేమో అని నా శ్రీమతి ఇంటర్నెట్ లో వెతికి ఈ దేశపు వివరాలని తెలుసుకుంది. ఆస్ట్రియాకి స్విట్జెర్లాండ్ కి మధ్య కేవలం 61 చదరపు మైళ్ళ వైశాల్యంతో ఉన్న ఈ అతిచిన్న దేశం ఎలా ఉంటుందో చూడాలని ఆసక్తి కలగటంతో ముందుగా ఈ దేశాన్ని చూసి అక్కడ నుంచి స్విట్జర్లాండ్ మీదుగా మిగతా దేశాలన్నీ వెళదామని ప్లాన్ చేసుకున్నాం. సాధారణంగా యూరప్ టూర్ కి మే మొదటివారం నుండే అనుకూలం . అక్టోబర్ నుండి ఏప్రిల్ వరకు ఈ దేశాలన్నీ మంచుతో కప్పబడే ఉంటాయి.శీతా కాలం తరువాత వచ్చే వసంతాన్ని చూడటానికి రెండుకళ్ళూ చాలవు. భూమి అంతా ఆకుపచ్చని దుప్పటి కప్పుకున్నట్లు ఎటు చూసినా పచ్చదనంతో ప్రకృతి నయనానంద కరంగా ఉంటుంది. 2011 డిసెంబర్ నుండి లిచ్టేన్ స్టెయిన్ Schengen దేశాలతో ఒకటిగా కలిసింది. దేశపు సరిహద్దుల్ని తొలగించింది కూడా అప్పుడే. ఐరోపా యూనియన్లో ఆఖరున 26 వ దేశంగా సభ్యత్వం పొందింది.
ఎప్పుడూ అందరూ వెళ్ళే పారిస్, స్విట్జెర్లాండ్ కాకుండా ఇంకేమన్నా కొత్త దేశాలున్నాయేమో అని నా శ్రీమతి ఇంటర్నెట్ లో వెతికి ఈ దేశపు వివరాలని తెలుసుకుంది. ఆస్ట్రియాకి స్విట్జెర్లాండ్ కి మధ్య కేవలం 61 చదరపు మైళ్ళ వైశాల్యంతో ఉన్న ఈ అతిచిన్న దేశం ఎలా ఉంటుందో చూడాలని ఆసక్తి కలగటంతో ముందుగా ఈ దేశాన్ని చూసి అక్కడ నుంచి స్విట్జర్లాండ్ మీదుగా మిగతా దేశాలన్నీ వెళదామని ప్లాన్ చేసుకున్నాం. సాధారణంగా యూరప్ టూర్ కి మే మొదటివారం నుండే అనుకూలం . అక్టోబర్ నుండి ఏప్రిల్ వరకు ఈ దేశాలన్నీ మంచుతో కప్పబడే ఉంటాయి.శీతా కాలం తరువాత వచ్చే వసంతాన్ని చూడటానికి రెండుకళ్ళూ చాలవు. భూమి అంతా ఆకుపచ్చని దుప్పటి కప్పుకున్నట్లు ఎటు చూసినా పచ్చదనంతో ప్రకృతి నయనానంద కరంగా ఉంటుంది. 2011 డిసెంబర్ నుండి లిచ్టేన్ స్టెయిన్ Schengen దేశాలతో ఒకటిగా కలిసింది. దేశపు సరిహద్దుల్ని తొలగించింది కూడా అప్పుడే. ఐరోపా యూనియన్లో ఆఖరున 26 వ దేశంగా సభ్యత్వం పొందింది.
పోలాండ్ లో నేనుండే ప్రాంతం నుండి లిచ్టేన్ స్టెయిన్ 930 కిలోమీటర్లు,అక్కడనుండి స్విట్జెర్లాండ్ 150 కిలోమీటర్లు. పోలాండ్ నుండి జర్మనీలో బెర్లిన్ మీదుగా 880 కిలోమీటర్లు ప్రయాణించి ఆస్ట్రియాలో మరో 40 కిలోమీటర్లు ప్రయాణించాక ఆ దేశపు సరిహద్దు నుంచి పదికిలోమీటర్ల లోపే లిచ్టేన్ స్టెయిన్ రాజధాని వాడుజ్ చేరుకోవచ్చు. ఇక్కడి రోడ్లమీద సగటు వేగం గంటకి 120 కిలోమీటర్లు. వెయ్యి కిలోమీటర్లు ఏకదాటిన ప్రయాణించినా మనకి అలసట అనేది ఉండదు. ఎక్కడా చిన్న కుదుపు కాని గతుకులు కాని ఉండవు. హైవేలు అన్నీ ఇరుపక్కలా బారికేడ్స్ తో ఉండటంతో రోడ్ మధ్యలోకి ఎవరూ వచ్చే అవకాశం కూడా లేదు.దూరం ఎక్కువైనా కార్లో ఆ ప్రకృతిని ఆస్వాదిస్తూ వెళ్తుంటే ఆ సంతోషమే వేరు. అందుకే ఏప్రిల్ 28 తెల్లవారిఝామున కార్లో బయలుదేరాం. చాలా మంది విదేశాలకి వెళ్ళినపుడు కూడా ఇండియన్ ఫుడ్ కోసం వెతుకుతుంటారు. స్విట్జెర్లాండ్ దాకా వెళ్లి ఇడ్లి తినాలా అనేది నా అభిప్రాయం. ఏదైనా కొత్త ప్రాంతానికి వెళ్ళేది ఆ ప్రాంతపు విశేషాలు, ఆహారపు అలవాట్లు తెలుసుకోవటానికి,అలాంటప్పుడు అక్కడ లభించే ఆహారాన్ని రుచి చూడాలి తప్ప,మన ఆవకాయన్నం, పులిహోరా అవసరమా అనేది నా ఆలోచన. నా శ్రీమతి కూడా నాతొ ఏకీభవించటంతో అలాంటి ఫుడ్ పార్సిల్ ఏమి లేకుండానే బయలుదేరాం. ఆ రోజు వర్షం పడుతుండటంతో కొంచెం నెమ్మదిగానే డ్రైవ్ చేసుకుంటూ జర్మనీలోని బెర్లిన్ , న్యురేం బర్గ్ మీదుగా మధ్యాహ్నం మూడు గంటల కల్లా జర్మనీ- ఆస్ట్రియా సరిహద్దుకి చేరుకున్నాం. ఇతర దేశాల కార్లు ఆస్ట్రియా రోడ్లపై ప్రయాణించాలంటే టోల్ చెల్లించాలి. టోల్ రుసుము వారానికి 8 యూరోలు. బోర్డర్ దగ్గర ఆగి ఆ రుసుము చెల్లించి రసీదు తీసుకున్నాం. జర్మనీ ని ఆస్ట్రియా ని వేరు చేస్తూ మధ్యలో ఆల్ఫ్స్ పర్వతాలు ఉన్నాయి. ఆ పర్వతాల కిందుగా 2 కిలోమీటర్ల పొడవున్న టన్నెల్ గుండా ప్రయాణించి ఆస్ట్రియాలో కి ప్రవేశించాం. ఆస్ట్రియా నుండి స్విట్జెర్లాండ్ వెళ్ళే హైవే పై 30 కిలోమీటర్లు ప్రయాణించాక ఫెడ్రిక్ అనే ప్రాంతం నుండి కుడివైపు పది కిలోమీటర్లు ప్రయాణించాక ఆల్ఫ్స్ పర్వత శ్రేణుల మధ్య పారే రైన్ నది అందాల్ని ఆస్వాదిస్తూ fürstentum of Liechtenstein అనే బోర్డ్ ని దాటుకుని లిచ్టేన్ స్టెయిన్ రాజధాని వాడుజ్ చేరుకున్నాం.
fürstentum అంటే జర్మన్ భాషలో రాజ్యం అని అర్ధం.ఈ దేశం రాచరిక వ్యవస్థని కలిగి ఉంది కనుక అలా పిలుస్తారు. ఈ దేశానికి తూర్పున ఆస్ట్రియా, పడమర,దక్షిణాన స్విట్జెర్లాండ్ సరిహద్దు దేశాలు. స్విట్జెర్లాండ్ ని, లిచ్టేన్ స్టెయిన్ తో వేరు చేస్తూ రైన్ నది ప్రవహిస్తూ ఉంటుంది. దేశంలోకి వెళ్ళాలంటే ఈ నదిపై ఉన్న వంతెన మీదుగానే వెళ్ళాలి. లిచ్టేన్ స్టెయిన్ యూరప్ లో నాలుగవ అతి చిన్నదేశం(వాటికన్ సిటీ,మొనాకో,సాన్ మారినో వరుసగా మొదటి మూడు స్థానాల్లో ఉంటాయి) మరియు ప్రపంచం లో ఆరవ చిన్న దేశం. దీని జనాభా కేవలం 36000. దేశం మొత్తం దాదాపు కొండవాలులోనే ఏటవాలుగా ఉంటుంది.
నగరంలోకి ప్రవేశించగానే అసలు మనం ఉన్నది భూమి మీదేనా అన్న భావన కలిగింది. ఎదురుగా పచ్చటి ఆల్ఫ్స్ పర్వతాలు, వాటి మీద అక్కడక్కడా ఇళ్ళు. స్వర్గం ఎలా ఉంటుందో ఎవ్వరూ చూడలేదు కాని,మాకు మాత్రం నిజంగా ఇదే స్వర్గమేమో అనిపించింది. రోడ్ల వెడల్పు తక్కువైనా అద్దాల్లా మెరిసిపోతూ మాకు స్వాగతం పలికాయి. అప్పటికే సాయంత్రం 4 గంటలు అయింది. యూరప్ లో రాత్రి 9 గంటలదాకా సూర్యుడు ఉంటాడు. పదిగంటలకి కాని చీకటి పడదు. ఈ దేశంలో ఉన్న పట్టణాల సంఖ్య పదకొండు. వాడుజ్ అనే పట్టణం దేశానికి రాజధాని. కాని ఎక్కువమంది నివసించేది మాత్రం షాన్ అనే పట్టణంలో. పది చదరపు మైళ్ళ వైశాల్యం, 5800 మంది జనాభాతో షాన్ పట్టణం అతి పెద్ద నగరంగా ఉంది. దేశరాజధాని వాడుజ్ లో 5300 మంది నివసిస్తారు. కేవలం నాలుగు పట్టణాలు మాత్రమే నేలమీద ఉంటాయి. మిగతా ఏడు పట్టణాలు కొండవాలులో మరియు కొండపైనే ఉంటాయి. ట్రైసన్ బెర్గ్ అనే పట్టణం పూర్తిగా కొండపైనే ఉంటుంది. ఎక్కువ టూరిస్టులు బస చేసేది ఇక్కడే. ఇకడ్నుంచి చూస్తే దేశం మొత్తాన్ని ఒకే ఫ్రేం లో బంధించేయచ్చు.
మా ప్లాన్ ప్రకారం ఆ రాత్రికే బయలుదేరి స్విట్జెర్లాండ్ లో జురిచ్ చేరుకొని బస చేయాలి. కాని ఎందుకో ఈ దేశాన్ని వదిలి వెళ్ళ బుద్ధి కాలేదు. ట్రైసన్ బెర్గ్ లో బస చేద్దామని హోటల్ కోసం వెతికాం. ఆరోజు ఆదివారం కావటంతో టూరిస్ట్ లతో హోటల్స్ అన్నీ నిండిపోయాయి. ఒక హోటల్ రిసెప్షనిస్ట్ ఆస్ట్రియాలో ఒక హోటల్లో ఖాళీ ఉందని చెప్పి అడ్రస్ తో సహా రాసి ఇచ్చాడు. ఇక్కడ మనుషులు ఎంత మంచివారంటే,మేము ఏదైనా అడిగితే వారికి ఇంగ్లీష్ రాకపోయినా మాకు ఎలాగోలా సహాయం చెయ్యాలనే తపన మమ్మల్నెంతగానో ఆకట్టుకుంది.అమెరికాలో స్థిరపడినంతగా మనవాళ్ళు యూరప్ లో లేకపోవటానికి ముఖ్యకారణం భాష మరియు వాతావరణం అనేది నా అభిప్రాయం. లిచ్టేన్ స్టెయిన్ అధికారిక భాష జర్మన్.జర్మన్ తో పాటు అల్మీనిక్ భాష కూడా మాట్లాడతారు. మొదటి ప్రపంచ యుద్ధం వరకు ఈ దేశం పూర్తిగా ఆస్త్రియాతో సంభంధాలు కలిగి ఉండేది. ఆతరువాత స్విట్జెర్లాండ్ కి దగ్గరగా జరిగింది. ఇక్కడ అధికారిక కరెన్సీ కూడా స్విస్ ఫ్రాంకు లే. కాకపొతే యూరో కూడా చెల్లుబాటు అవుతుంది. ప్రతి షాపులో యూరో అయితే ఎంత చెల్లించాలొ, ఫ్రాంకు లైతే ఎంత చెల్లించాలొ ఉంటుంది.మొదటగా 1608 లో హోలీ రోమన్ ఎంపైర్ ఈ దేశాన్ని నిర్మించాడు. షెల్లేన్ బెర్గ్ మరియు వాడుజ్ పట్టణాలు మాత్రమే అప్పుడు నిర్మించబడ్డాయి. మిగతావన్నీ తరువాతి కాలంలో విస్తరించారు. తదనంతరకాలంలో రోమన్ సామ్రాజ్యం పతనం అవటంతో 1815 జూన్ నుండి జర్మన్ ఫెడరేషన్ లో ఉంది. ఆ తరువాత 1866 లో జర్మనీ నుండి వేరు పడి ఆస్త్రియాతో కలిసి స్వతంత్ర రాజ్యంగా ఉంది.మనదేశానికి స్వతంత్రం వచ్చిన ఆగస్ట్ 15 రోజు ఈ దేశానికి స్వతంత్రం రావటం విశేషం. కాబట్టి ఆ రోజుని జాతీయ దినంగా జరుపుకుంటారు.1923 నుండి స్విట్జెర్లాండ్ తో సన్నిహితంగా ఉండటంతో దాదాపుగా ఆ సంస్కృతే ఇక్కడ కూడా కన్పిస్తుంది. 1836 లో ఇక్కడ తోలి ఫాక్టరీ ని నిర్మించారు. పింగాణి టైల్స్ ని తయారు చేసేవారు.ఇప్పటికీ ఇదే పెద్ద పరిశ్రమ. ఇక ఆరోజుకి ట్రైసన్ బెర్గ్ మరియు కొండ పై ఉన్న మరో చిన్నగ్రామంతో పాటు రాజు నివసించే పాలస్ కూడా చూసాం.
కొండలమీద ఆవులతోపాటు,మేకలు గొర్రెలు కూడా మేత మేస్తూ కనిపించాయి. కొండమీదకి ఎక్కుతున్నపుడు, దిగుతున్నప్పుడు రోడ్ కొంచెం భయంగా అనిపించినా అక్కడున్న ట్రాఫిక్ క్రమశిక్షణ వల్ల ఎటువంటి ప్రమాదాలు జరగవట. అన్ని ఇళ్ళు ఒకేచోట కాకుండా విసిరేసినట్లు అక్కడొకటి అక్కడొకటి కొండ మీద నిర్మించుకున్నారు. ఇక్కడి ప్రజలు ఎక్కువ ప్రైవసీ ని ప్రశాంతతని కోరుకుంటారు. ఇక కిందకి దిగాక వాడుజ్ లో ఉన్న మ్యూజియం కి వెళ్ళాం. అప్పటికే సమయం మించిపోవటంతో ఆ రోజు ప్రవేశం లేదు.ఇక అక్కడనుంచి పది కిలోమీటర్ల దూరంలోనే ఆస్ట్రియా బోర్డర్ ఉంది. మేము వచ్చిన దారి కాకుండా ఆస్ట్రియా లో ప్రవేశించటానికి ఇది మరొక సరిహద్దు.
No comments:
Post a Comment