ఇప్పుడు మేము వెళ్ళబోయేది స్విట్జర్లాండ్ లో Schaffhausen లో ఉన్న రైన్ ఫాల్స్ అనే జలపాతం. ఇది ఆ దేశానికి ఉత్తరభాగాన ఉంది. అంటే మేము ఉన్న ఆస్ట్రియా సరిహద్దు నుండి 120 కిలోమీటర్లు. ఆస్ట్రియా కి స్విట్జెర్లాండ్ కి మధ్యలో ఒక నది ఉంది అదే ఆ రెండిటి మధ్య బోర్డర్. ఆ బోర్డర్ దగ్గర పోలీసులు కార్లు ఆపి చెక్ చేస్తున్నారు.మేము మా పాస్ పోర్ట్లు తీసుకుని చెక్ పోస్ట్ లోకి వెళ్లి చూపించాము. పోలాండ్ వీసా ఉండటంతో చెక్ చేసి వెంటనే ఇచ్చేసారు.
యూరప్ లో ఉన్న అన్ని దేశాల్లోకి స్విట్జెర్లాండ్ చాలా ఖరీదైన దేశం.అందుకే కొంతమంది సరిహద్దు దేశాలనుండి బీరు, సిగరెట్లు లాంటివి తీసుకు వెళుతుంటారట. అందుకే ఈ చెకింగ్ అని మార్చిన్ చెప్పాడు. జర్మనీ తో పోలిస్తే కూడా పోలాండ్ చాలా చవకైన దేశం. మేము జర్మనీ వెళ్ళేటప్పుడు కూడా బోర్డర్ లో పెట్రోల్ బంకులన్నీ బిజీ గా ఉండేవి. జర్మన్ దేశస్తులు , పోలాండ్ మీదుగా జర్మనీ వెళ్ళేవారు , పోలాండ్ పెట్రోల్ బంకుల్లో ఫుల్ చేయించుకుని అక్కడే సిగిరెట్లు బీర్లు తదితర ఆహార పదార్ధాలని కొనుక్కుని వెళ్ళేవారు. ఆస్ట్రియా సరిహద్దు నుండి స్విట్జెర్లాండ్ లోకి ప్రవేశించగానే వర్షం చినుకులు ప్రారంభం అయ్యాయి. చిన్న చిన్న ఊర్లు , ఎటు చూసినా పచ్చటి పొలాల మధ్య నుండి దాదాపు గంటన్నర ప్రయాణించాక రైన్ ఫాల్స్ జలపాతం దగ్గరకి చేరుకున్నాం.
అప్పటికే సాయంత్రం సమయం 5 గంటలు అయ్యింది.అక్కడ అన్నీ టూరిస్ట్ బస్సులు , కార్లు పార్క్ చేసి ఉన్నాయి. మన దేశం నుండి అందించే స్విట్జెర్లాండ్ టూర్ పాకేజీ లో ఈ రైన్ ఫాల్స్ అనేది తప్పకుండా ఉంటుంది.ఇండియా నుండి థామస్ కుక్ ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళ గ్రూపు ఒకటి కనిపించింది. అందులో తెలుగు వాళ్ళు , తమిళియన్స్ కనిపించారు.అప్పటికే ఆ గ్రూప్ టూర్ పూర్తవటంతో తిరుగు ప్రయాణంలో ఉన్నారు. దాదాపు 11000 ఏళ్ల క్రితం ఈ జలపాతం ఏర్పడింది. సంవత్సరానికి సగటున 750 క్యూబిక్ మీటర్ల నీరు ఈ జలపాతం గుండా ప్రవహిస్తుంది. మొదట్లో దీనిని వాణిజ్య అవసరాలకి కి కూడా ఉపయోగించారు.19 వ శతాబ్దం లో ఈ నీటిని ఆధారంగా చేసుకుని ఒక ఐరన్ కరిగించే కర్మాగారం నెలకొల్పారు. ఆ తరువాత ఇక్కడ ఒక హైడ్రో పవర్ విద్యుత్ ఉత్పాదక కేంద్రం కోసం ఆ కంపెనీ దరఖాస్తు చేసుకున్నపుడు ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత రావటంతో ఆ ప్రతిపాదన నిలిపి వేశారు. తదనంతరం ఆ ఐరన్ కంపెని కూడా మూత పడింది. తర్వాత ఎన్నో ప్రతిపాదనలు వచ్చినా ఇప్పటికీ పూర్తి స్థాయి హైడ్రో పవర్ జనరేషన్ ప్లాంట్ పెట్టలేకపోయారు. ఈ నీటి సామర్ధ్యంతో 50 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి చెయ్యవచ్చు. కాని విలువ పరంగా చూస్తే టూరిజం ద్వారా వచ్చే ఆదాయం దీనికి 2 రెండు రెట్లు ఎక్కువ. బహుశా అందుకోసమే ఆ ప్రాజెక్టు ముందుకి కదల్లేదేమో.
జలపాతం దగ్గరగా వెళ్ళటానికి అక్కడ బోటు సర్వీస్ లు ఉన్నాయి. కాని 5.30 వరకు మాత్రమె ఈ సర్వీసులు ఉన్నాయి. మేము వెళ్ళేటప్పటికి ఆఖరి బోటు వెళ్ళిపోయింది. అయినా కూడా ఒక కిలోమీటరు చుట్టూ నడిచి మెట్లు ఎక్కితే జలపాతపు పై భాగాన్ని దగ్గరగా చూడవచ్చు. మేము అలా ఫోటోలు తీసుకుంటూ పై భాగానికి చేరుకున్నాము. నీళ్ళు భీకర శబ్దంతో ప్రవహిస్తూ ఉన్నాయి. ఇప్పటిదాకా 1921 లో ఒక్కసారి మాత్రమే ఈ జలపాతంలో తక్కువ ప్రవాహం నమోదు అయ్యిందట. 1965 లో అత్యంత ఎక్కువ ప్రవాహం 1250 క్యూబిక్ మీటర్ల నీరు ప్రవహించింది. అప్పటికే చీకటి పడటం ప్రారంభమైంది.
మేము రాత్రికి హోటల్ కూడా బుక్ చేసుకోలేదు. మార్చిన్ కూడా స్విస్ లో చూడదగిన ప్రదేశాలన్నీ గ్రామీణ ప్రాంతంలోనే ఉంటాయని చెప్పాడు. జురిచ్ లో మేము బస చేసినా అక్కడ చూడదగిన ప్రాంతాలు ఏమి లేవు. స్విస్ అందాలన్నీ ఇంటర్ లాకేన్ మరియు ఇతర గ్రామ ప్రాంతాల్లోనే బావుంటాయి. అక్కడినుండి జురిచ్ మీదుగా పారిస్ వెళ్దామని మార్చిన్ ప్రతిపాదించాడు. కాని నేను వారించాను అంత దూరం నిద్ర లేకుండా డ్రైవింగ్ చెయ్యటం కష్టం, జురిచ్ లో బస చేద్దాము అని. కాని మార్చిన్ వినలేదు , రేపు ఉదయానికల్లా పారిస్ చేరుకోవాలని , డ్రైవింగ్ విషయం తనకి వదిలేయమన్నాడు. కాని ఆ తరువాత తెలిసింది అతని డ్రైవింగ్ కెపాసిటీ ఏమిటో.మేము ఒక పక్క నిద్రపోతూ ఉంటె కూడా అత్యంత జాగ్రత్తగా కంటి మీద కునుకు అనేది రాకుండా కార్ నడిపేవాడు. యూరోపియన్లు చాలా జాగ్రత్త పరులు, సామర్ధ్యం లేకుండా ఎటువంటి సాహసాలకి ఒడిగట్టరు. ఇక్కడ డ్రైవింగ్ నిబంధనలు కూడా అలాగే ఉంటాయి. సరకులు రవాణా చేసే ట్రక్కులు , ప్రయాణీకులని చేరవేసే బస్సులు రోజుకి 8 గంటలకి మించి డ్రైవింగ్ చెయ్యకూడదు. ఒకవేళ అలా చేసినా ఆ వాహనాల్లో ఉన్న సెక్యురిటి సిస్టం లో రికార్డ్ అయిపోతుంది. అందుకే 8 గంటలు డ్రైవ్ చెయ్యగానే ఎక్కడో ఓ చోట ఆపేసి రెస్ట్ తీసుకుంటారు.ఎంత అవసరం ఉన్నా సరే ఇంజిన్ కూడా స్టార్ట్ చెయ్యరు. రైన్ ఫాల్స్ నుండి జురిచ్ 50 కిలోమీటర్లు అక్కడినుండి బయలుదేరితే గంట లోపల జురిచ్ చేరుకోవచ్చు. మేము జురిచ్ చేరుకునేటప్పటికి రాత్రి 8 గంటలు అయ్యింది.
2008 వరకు కూడా స్విట్జెర్లాండ్ కి వేరే వీసా తీసుకోవాల్సి వచ్చేది. 2004 లోనే యూరోపియన్ యూనియన్ లో చేరినా కొంత కాలం వీసా వేరుగానే ఉండేది. మా కారుని ఎక్కడైనా పార్క్ చేసి నడుస్తూ నగరాన్ని చూడాలని అనుకున్నాం. జురిచ్ లో వాకింగ్ టూర్ అని ఉంటుంది. మొత్తం నడుస్తూనే పాత నగరాన్ని , కొత్త నగరాన్ని చూడవచ్చు. దానితోపాటు బోటు టూరు ఉంటుంది. నగరం మధ్యలో ఉండే లిమ్మట్ నది అన్ని ప్రదేశాలని కలుపుతూ ఉంటుంది. దాదాపు జురిచ్ అంతా ఈ నది కి అటు ఇటు ఉంటుంది. ఈ బోటుకి ట్రాము కలిపి ఒకే టిక్కెట్టు ఉంటుంది. అవసరమైన బోటు స్టేషన్ల దగ్గర దిగి నగరంలో ట్రాము ఎక్కి అక్కడి ప్రదేశాలు చూడవచ్చు. కార్ పార్కింగ్ కోసం ప్రత్యేకమైన భవనాలు ఉంటాయి, ఎక్కడికక్కడ పార్కింగ్ బోర్డులు కనిపిస్తుంటాయి. మేము ఒక ప్రైవేటు కార్ పార్కింగ్ చూసుకుని అందులో కార్ పార్క్ చేశాము. స్విస్ అధికారిక కరెన్సీ స్విస్ ఫ్రాంకులు. గంటకు 4 స్విస్ ఫ్రాంకులు పార్కింగ్ ఫీజు. అక్కడ ఆటోమాటిక్ వెండింగ్ మెషిన్ కేవలం ఫ్రాంకులు మాత్రమే తీసుకుంటుంది. మళ్ళీ బయటకి వచ్చి మా దగ్గరున్న యూరోలతో ఫ్రాంకులని మార్చుకున్నాం.
ఇక అక్కడినుండి నడుస్తూ సిటీ అంతా చూసుకుంటూ లిమ్మట్ నది ఒడ్డున కాసేపు అలా కూర్చున్నాం. జురిచ్ అంతా మేము రాత్రి వేళలోనే చూడటం జరిగింది. జురిచ్ లో కత్తులు , చాకులు చాలా ఫేమస్ victronix అనేది మంచి బ్రాండ్ . మార్చిన్ వాళ్ళ నాన్న తన మనుమడికి ఆ నైఫ్ ఒక్కటి కొనుక్కోమని డబ్బులు ఇచ్చాడు. జూరిచ్ వచ్చీ రాగానే మాక్సిం వాళ్ళ నాన్న ని అడగటం మొదలు పెట్టాడు. అక్కడొక షాపింగ్ సెంటర్ లో ఆ నైఫ్ ఒక్కటి కొన్నాడు.
విండో షాపింగ్ లో వాచీలు , జ్యుయలరి అన్నీ చూసుకుంటూ దాదాపు 2 గంటలు అక్కడే గడిపాము. రోడ్ పై ఒక పక్కగా ఉన్న బావిలో అందరూ చిల్లర వేయటం గమనించాము. కాని ఎందుకో అర్ధం కాలేదు. ఇక్కడ అధికారిక భాష జర్మన్. ఫ్రెంచ్, ఇటాలియన్ , లాటిన్ భాషలు కూడా ఎక్కువగా మాట్లాడతారు.అప్పటికి సమయం 9 గంటలు అయ్యింది. ఎవరికీ పెద్దగా ఆకలి లేకపోవటంతో దార్లో తిందాములే అని పార్కింగ్ లో కార్ తీసుకుని పారిస్ వైపుగా మా ప్రయాణం ప్రారంభమైంది.

1 comment:
thanks for sharing....తెలుగోళ్ళకి యాతనలు ఎక్కువ..యాతనలూ...యావలూ......కామెంట్లు కూడా పెట్ట లేరు....ఓపిగ్గా మీ యాత్రానుభవాలు ప్రెజెంట్ చేసారు...థాంక్యూ....
Post a Comment