శ్రీ వేమూరి వెంకట నరసింహారావు గారు
ఇపుడైతే మన గ్రామంలో యువకులంతా అమెరికా వెళ్లటం సర్వసాధారణ విషయమే కాని,అసలు తొట్ట తొలిసారిగా మన గ్రామం నుంచి అమెరికా వెళ్లిన వ్యక్తి శ్రీ వేమూరి నరసింహారావు గారు.ఎప్పుడూ విన్నట్లు లేదు కదూ,మనం మరిచిపోతున్న పాత తరం చరిత్ర మరియు వ్యక్తుల్లో శ్రీ వేమూరి వెంకట నరసింహారావు గారు ఒకరు.ఘంటసాలలో ఆంగ్లవిద్య లో తొలి పట్టబద్రుడు (First graduate in English medium)ఈయనే.ఆంధ్రప్రభ సబ్ ఎడిటర్ గా 1950మరియు 1960 దశకాల్లో పత్రికారంగానికి ఎనలేని సేవ చేశారు.
"గౌరీశంకర్" అనే కలం పేరుతో ఈయన రాసిన "శిఖరాలు"అనే శీర్షిక సుమారు 5సంవత్సరాలపాటు తెలుగు స్వతంత్ర పత్రికలో ప్రచురితమై పాఠకుల మన్ననలు పొందింది.ఎటువంటి క్లిష్టమైన విషయమైనా అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్లు చెప్పగల నేర్పు నరసింహారావు గారి సొంతం.
1950దశకంలో ఆంధ్రపత్రికా ప్రతినిధుల తరపున ఆయన తొలిసారిగా అమెరికాలో పర్యటించారు.ఆ విధంగా మనగ్రామం నుండి తొలిసారి అమెరికా వెళ్ళిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు.ఇంతటి ఘనకీర్తిని సొంతం చేసుకున్న నరసింహారావు గారి గురించి ఈతరానికి తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
శ్రీ వేమూరి సుబ్రమణ్యేశ్వరరావు మరియు అందరికి తెలుగు అధ్యాపకుడిగా సుపరిచితులైన శ్రీ వేమూరి విశ్వేశ్వరరావు ఈయన కుమారులు.
No comments:
Post a Comment