Saturday, September 8, 2012

రుద్ర భూమి అభివృద్ధి


అభివృద్ధి కాముకులైన ఘంటసాల గ్రామ ప్రజలకు,జన్మ భూమి అభివృద్ధి ని కాంక్షించే ప్రవాస గ్రామస్తులకి వినయ పూర్వక విజ్ఞప్తి.
 
" జాతస్య హి  ధ్రువో మృత్యుహు " జన్మించిన ప్రతి ప్రాణి మరణించక తప్పదు.జననము లాగే మరణాన్ని కూడా ఒక పవిత్ర కార్యక్రమము గా భావించి కార్యము నిర్వహించే ఏకైక జాతి మానవ జాతి.అందుకే మనిషి చేసే సంస్కారములలో "అంత్యేష్టి " కూడా చేర్చారు.ఈ అంతిమ సంస్కారానికి మాత్రం వేదిక స్మశానం మాత్రమే.ఈ పవిత్ర ప్రదేశం లోనే పంచ భౌతికమైన మనిషి శరీరం పంచభూతాల్లో కలిసిపోతుంది.

మనిషి జీవితం లో ఆఖరి మజిలీ స్మశానం.అప్పటిదాకా సర్వ సౌఖ్యాలతో బతికిన మనిషి చివరి మజిలీ మాత్రం మురికి గుంటలతో, దుర్ఘంధంతో, పాముల పుట్టలతో, ముళ్ళ తుప్పలతో నిండిన స్మశానం లో చేయాల్సి వస్తోంది. అతి పవిత్రంగా,శుచిగా,శుభ్రత తో ఉండాల్సిన దహన వాటిక నేడు తన రూపునే కోల్పోయి కనీసం కాలు కూడా పెట్టలేని దుస్థితికి చేరుకుంది. వర్షం వస్తే దహన కాండలు జరపలేని పరిస్థితి.మొత్తం 8.32 ఎకరాల విస్తీర్ణం లో ఉన్న మన ఊరి స్మశానాన్ని పవిత్ర రుద్రభూమి గా మార్చేయటానికి మన గ్రామానికే చెందిన శ్రీ  వీరపనేని సుబ్రహ్మణ్యం, శ్రీ వీరపనేని ఆనంద్ సోదరులు తమ మాతా మహులు శ్రీ గొర్రెపాటి సుబ్రహ్మణ్యం,లక్ష్మీ కాంతమ్మ మరియు శ్రీ గొర్రెపాటి వెంకట రామయ్య,విశాలక్ష్మమ్మ గార్ల జ్ఞాపకార్ధం వారి తల్లి గారైన సరోజినీ గారి ఆధ్వర్యం లో మొత్తం వ్యయం లో 50 % సమకూర్చటానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. అంటే విరాళంగా వచ్చే ప్రతి రూపాయికి మరొక రూపాయి వారు జత చేస్తూ నిర్మాణాన్ని కొనసాగిస్తారు.
 

 

దాదాపు 50 లక్షల అంచనా వ్యయం తో ప్రారంభం కానున్న ఈ బృహత్కార్యానికి మీ అందరి సహకారం ఉంటే, గ్రామం లో సకల సౌకర్యాలతో కూడిన రుద్రభూమి నిర్మాణం సులువుగా పూర్తి అవుతుంది. ప్రస్దిద్ధ శైవ క్షేత్రమైన మన గ్రామానికి శివుడికి ఇష్టమైన స్మశానం ముఖ ద్వారంగా ఉండటం దైవికమే. కానీ ఆ ప్రాంతాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్ది గ్రామానికి మహా ముఖద్వారంగా మలచాల్సిన భాధ్యత మనందరిది.

1) మహా ముఖ ద్వారాన్ని నిర్మించటం
2) అధునాతన కాస్టింగ్ విధానం లో దహన వాటిక
3) దహన మందిరం
4) విశ్రాంతి గదులు 
5) అంతర్గత రహదారులు 
6) స్నానపు గదులు 
7) ఉద్యాన వనాల ఏర్పాటు.
8) అస్థికల ముంతలని భద్రపరిచే గదులు
9) శీతల శవ పేటిక సౌకర్యం
10) శవ వాహనాన్ని ఏర్పాటు చెయ్యటం.
11) కార్యాలయం మరియు కాటికాపరి నివాస భవనం.

మీ విరాళాలని చెక్కు రూపం లో కానీ డిడి రూపం లో కానీ కమిటీ కి అందచేయగలరు.

ఇట్లు 
రుద్ర భూమి (స్మశాన వాటిక) అభివృద్ధి కమిటీ 
వీరపనేని సుబ్రహ్మణ్యం - మొబైల్ : 9849011189
గొర్రెపాటి వెంకట రామకృష్ణ - మొబైల్ : 9985463899



 గౌరవ సలహాదారు మరియు సమన్వయ కర్త
శ్రీ మూల్పూరి చెన్నారావు గారు (విశ్రాంత ఉపాధ్యాయులు)
 

No comments: