ఎందుకో పొద్దుట్నుంచీ తెలియని బాధ గా ఉంది. నేను ఈ టీవీ సుమన్ కి ఫాన్ ని మాత్రం కాదు. ఒకరకంగా నాకు ఆయన సీరియల్స్ నాకు నచ్చవు కూడా.ఆయన రాసిన శ్రీహరి స్వరాలు మాత్రం చాలా ఇష్టం. కానీ ఎందుకో ఆయన మరణం,ఆ అంత్యక్రియల్లో రామోజీ ని చూసాక గుండె బరువెక్కింది. వ్యక్తి తలుచుకుంటే వ్యవస్థ ని మార్చగలడు లేదా తానే ఒక వ్యవస్థగా మారగలడు అని నిరూపించి రాష్ట్రానికి లక్ష్మీ పుత్రుడుగా భావించే రామోజీరావు ని ఆ స్థితిలో చూడటం మాత్రం చాలా బాధ గా ఉంది.
సుమనోహరుడివని, సుమనస్కుడివని ఎరిగి నీ కమ్మని కౌగిట కరిగి కళ కళ లాడాలని సుమబాలలెన్నో నీ ముంగిట నిలిచేరా సుందర సుకుమార స్వామీ...అందాల నిలువలు, వెన్నెల వలువలు, కల్మషమెరుగని తెల్లని విలువలు, వెన్న లాంటి మనసులున్న ఈ కన్నె కలువలు, ఆశల అంబరాలై నిన్ను చేరాలని, సంబరాన ఆకాశమే తాకాలని నిలువెల్లా కళ్ళు చేసుకుని నీ రూపు పై చూపు నిలుపుకుని, నీ మానస సరోవరాన విహరించే వరానికై విరహంతో వేచెనురా. ధవళ నగల ధారివై ధగ ధగల తేలి నగవులు చిందించరా నగముల రేడా.. ..మా మంచి వాడా...
ఆయన రాసిన శ్రీహరి స్వరాలలో సాహిత్యం
ఆయన రాసిన శ్రీహరి స్వరాలలో సాహిత్యం
1 comment:
సుమన్ శ్రీహరిస్వరాలు వంటి కొన్ని పాటల్ని చూస్తుంటే.. అలా మన భారతీయ ఆధ్యాత్మిక సంపద పట్ల గౌరవంతో.. కొన్నేళ్లుగా ఆరోగ్యం బాలేకపోయినా పట్టుదలతో చేసే వ్యక్తుల్ని ఎక్కడ నుండి తీసుకురాగలం?
ఇది నల్లమోతు శ్రీధర్ గారి వ్యాఖ్య.. ఔనుకదా అనిపించింది.
Post a Comment